YS Sharmila: "నామ్ నరేందర్... కామ్ సరెండర్"... ప్రధాని మోదీపై షర్మిల విమర్శనాస్త్రాలు.

0
217

అమెరికాతో ప్రధాని మోదీ ఒప్పందంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

ఇది గ్రేట్ డీల్ కాదు, దేశానికి బ్లాక్ డీల్ అని వ్యాఖ్య

అమెరికా బ్లాక్ మెయిల్‌కు తలొగ్గి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపణ

సున్నా సుంకాలతో స్వదేశీ పరిశ్రమలకు, రైతులకు తీవ్ర నష్టమని ఆందోళన

ఒప్పందం పూర్తి వివరాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది 'గ్రేట్ డీల్' కాదని, భారతదేశానికి ఇదొక 'బ్లాక్ డీల్' అని అభివర్ణించారు. ప్రధాని మోదీ తీరు 'నామ్ నరేందర్.. కామ్ సరెండర్' (పేరు: నరేందర్... వృత్తి: లొంగిపోవడం) అన్నట్లుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్‌కు తలొగ్గి, ప్రధాని మోదీ దేశ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారని, ఆయన అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం దేశ భవిష్యత్తుకే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

 

అమెరికా ఉత్పత్తులపై సున్నా సుంకాలు విధించడం ద్వారా భారత మార్కెట్లను వారికి అప్పగించడం, మన స్వదేశీ పరిశ్రమలకు, రైతాంగానికి మరణశాసనం రాయడమేనని షర్మిల దుయ్యబట్టారు. 

 

"మన దేశ ఎగుమతులపై అమెరికా 18 శాతం సుంకాలు తగ్గిస్తే, వారి దిగుమతులపై మోదీ గారు సుంకాలు సున్నా చేయడం ఏంటి? మొన్నటిదాకా మన ఉత్పత్తులపై అమెరికా వేసిన పన్నులు 5 శాతం లోపే. ఇప్పుడు దాన్ని 50 శాతానికి పెంచి, అందులో 18 శాతం కుదిస్తే మనకు ప్రయోజనం ఎలా కలుగుతుంది? దీనివల్ల భారత్‌కు దక్కే ప్రయోజనం కంటే, సున్నా సుంకాలతో అమెరికాకు 100 శాతం లాభం చేకూరుతుంది" అని షర్మిల విమర్శించారు. ఇది భారత రైతుల మెడకు ఉరిపెట్టి, అమెరికా వ్యవసాయానికి మోదీ ఇచ్చిన గ్రేట్ డీల్ అని ఆమె మండిపడ్డారు.

 

అధ్యక్షుడు ట్రంప్ కోసం ప్రధాని మోదీ "మేక్ ఇన్ ఇండియా" నినాదానికి తిలోదకాలు ఇచ్చారని షర్మిల ఆరోపించారు. "రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే మళ్లీ సుంకాలు 50 శాతం పెంచుతామని ట్రంప్ బహిరంగంగా బెదిరిస్తుంటే ఇది బ్లాక్ మెయిల్ కాదా? ఆ భయంతోనే మోదీ సాగిలపడ్డారు," అని ఆమె వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాల మధ్య సమతూకంగా ఉండాలి కానీ, ఒక దేశానికి నష్టం, మరో దేశానికి లాభం చేసేవాటిని ఒప్పందాలు అనరని అన్నారు. 

 

75 ఏళ్ల భారత వాణిజ్య ఒప్పందాల చరిత్రను మోదీ తుంగలో తొక్కారని, 50 కోట్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాల కన్నా అమెరికా ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమయ్యాయని విమర్శించారు. ఏటా 100 బిలియన్ డాలర్ల దేశ సంపదను అమెరికాకు అప్పనంగా కట్టబెట్టే కుట్రలో ఈ ఒప్పందం భాగమని ఆరోపించారు. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ వెంటనే ఈ 'సరెండర్ అగ్రిమెంట్' పూర్తి వివరాలను బయటపెట్టాలని, కేవలం రెండు మూడు వస్తువుల గురించి కాకుండా అమెరికా నుంచి దిగుమతి కాబోయే అన్ని ఉత్పత్తులు, వాటిపై విధించే పన్నుల వివరాలను జాతికి తెలియజేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం వల్ల MRO పంచాయతీ సెక్రెటరీ...
By Boya Dasthagiri 2026-04-22 09:24:53 0 242
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*    *ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక...
By Rajini Kumari 2026-05-29 11:23:47 0 100
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:46:49 0 265
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 234
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com