మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*

0
285

మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు

దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు

గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించిన డాక్టర్ లక్ష్మీ గారు, మానవత్వంతో స్పందించి మరణించిన వారికి గౌరవం కలిగే విధంగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక గది అవసరం అని భావించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి దాదాపు ₹30 లక్షల వ్యయంతో నూతన మార్చురీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.

శనివారం సాయంత్రం ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురీ గది ఎక్కడ నిర్మించాలన్న విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ గారితో కలిసి స్థల పరిశీలన, చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య,

హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, సంఘ సేవకులు జి.వి. రత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య,

క్లస్టర్ నారపుశెట్టి మధు, ఊరిబిండి మధు, బెల్లా శ్రీను,

స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Technology
సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్
భారత్ అవాజ్ | హుజూర్‌నగర్   విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని...
By Malla Rambabu 2026-07-18 01:32:03 0 287
Andaman & Nikobar Islands
Islands Record India's Lowest Petrol Prices
As skyrocketing global crude oil prices push petrol past the ₹100-per-litre mark across almost...
By Dunna Jessicaruth 2026-05-25 04:44:58 0 90
Andhra Pradesh
మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని...
By Ratna Sekhar 2026-03-04 16:01:12 0 2K
Andhra Pradesh
ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన తమార లేజర్ సీఈవో సృష్టి సిబిలాల్
*దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి...
By Rajini Kumari 2026-01-21 14:42:49 0 193
Telangana
ఫీజు బకాయిలపై బీజేపీ యువ మోర్చా పోరుబాట.|
● పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్. ● ఈటల రాజేందర్ చేతుల మీదుగా...
By Sidhu Maroju 2026-07-25 09:17:50 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com