విద్యార్థుల వేదన కదిలించింది

0
203

విద్యార్ధుల వేదన కదిలించింది

 

• సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు 

• తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు 

• రోడ్డు కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు

 

పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.

• ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.

Search
Categories
Read More
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 767
BMA
Digital Darkness: Internet Blackouts Crushing Free Press
Governments are increasingly resorting to total internet blackouts and digital shutdowns to...
By JoinBMA 2026-08-19 10:30:30 0 171
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
By Sadaq Sadaq 2026-06-13 09:46:53 0 137
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com