టిఆర్ఎస్ పరిధిలో భోజనశాలను ప్రారంభించిన గద్దె రామ్మోహన్

0
192

విద్యావ్యవస్థను అగ్రగామిగా చేస్తున్న నారా లోకేష్‌

–9వ డివిజన్‌లో రూ.10 లక్షల సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో నిర్మించిన భోజనశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

+++++

 

          విద్యా వ్యవస్థను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.  

 

   శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్‌ కృష్ణవేణి స్కూల్‌ రోడ్డులో డిమార్ట్‌ ఎదురుగా ఉన్న కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఉజ్జయినీ ఫైనాన్స్‌ బ్యాంకు వారు సీఎంఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భోజనశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై భోజనశాలను ప్రారంభించారు.  

 

 

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఉజ్జయినీ ఫైనాన్స్‌ బ్యాంకు వారు రూ.10 లక్షలను సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను కేటాయించి బాలికల భోజనశాలను నిర్మించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారన్నారు. విద్య, వైద్యా రంగాల్లో సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కేటాయించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. నియోజకవర్గంలోని సంజయ్‌ కాలనీలో ఉన్న మరో మున్సిపల్‌ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడానికి ఉజ్జీయినీ ఫైనాన్స్‌ బ్యాంకు వారు అంగీకరించడం సంతోషకరమన్నారు. పటమట లంకలోని పెద్దలు రాబోయే తరాల వారు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో తమ విలువైన భూములను ప్రభుత్వానికి దానంగా ఇచ్చారన్నారు. ఆనాడు పెద్దలు స్థలాలను దానంగా ఇచ్చి పాఠశాలలను నిర్మాణం చేయబట్టే ఇప్పుడు చాలా మంది విద్యావంతులుగా మారారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్నా భోజన పథకంలో సమూల మార్పులు చేసి నాణ్యమైన ఆహారపదార్థాలతో విద్యార్థులను భోజనాలు పెడుతున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్శిటీలో చదువుకున్న నారా లోకేష్‌ విద్యాశాఖా మంత్రిగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. డీఎస్సీని ప్రకటించి çసమర్ధవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల గేటుకు అడ్మిషన్లు ఫుల్‌ అయ్యాయని బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. టీచర్లకు కూడా శిక్షణ ఇచ్చి విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుండేలా తయారు చేస్తామన్నారు. విద్యావ్యవస్థను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకు నారా లోకేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

   చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ ఉజ్జీయినీ ఫైనాన్స్‌ బ్యాంకు వారు సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.10 లక్షలు కేటాయించడం అభినందనీయమని అన్నారు. పెద్దల సహాకారంతోనే ఈ పాఠశాల భవనం నిర్మాణం చేశారన్నారు. చెన్నుపాటి విద్య గారు తమ సొంత ఇంటి మాదిరిగా ఈ పాఠశాలను చూసేవారన్నారు. దాతలు ఎంతో మంది స్పందించి పాఠశాలకు అవసరం అయినా సౌకర్యాలను కల్పించారని చెప్పారు. గద్దె రామమోహన్‌ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఈ పాఠశాల అభివృద్థికి నిధులు కేటాయించారని అన్నారు. ఎంతో మంది బాలికలు ఈ పాఠశాలలో చదువుకుని ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. 

 

    కార్యక్రమంలో ఉజ్జీవన్‌ బ్యాంకు సభ్యులు సత్యదేవ్, నాయకులు పొట్లూరి చంద్రశేఖర్, కార్పోరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, పొట్లూరి సాయిబాబు, వజీర్, పరంధామయ్య, గద్దె రమేష్, చిలకలపూడి లక్ష్మి నరసింహారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*  ...
By Rajini Kumari 2026-04-08 16:23:05 0 205
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
By Kothuru Murali 2026-04-05 07:46:31 0 185
SURAKSHA
Mohammed Ahsan Abid, IAS: Advancing Public Service
A dedicated 2014-batch IAS officer of the AGMUT Cadre, Mohammed Ahsan Abid has earned recognition...
By Lokeshwari Panthadi 2026-07-22 06:33:24 0 207
Telangana
ఎబివిపి అధ్వర్యం లో విద్యార్థుల ధర్నా
నిజామాబాద్ నగరం లోనీ కాంటేశ్వర్ లో  ఎబివిపి ధర్నా
By Sadaq Sadaq 2026-08-17 09:13:23 0 122
Andhra Pradesh
భార్య విడాకుల కేసు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం.
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర...
By Pagadala Venkateswar 2026-06-27 05:51:37 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com