YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల.

0
206

ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న

 

సంగమేశ్వరం బదులు ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కట్టడంపై అభ్యంతరం

 

స్వప్రయోజనాల కోసం సీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ

ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరూ నాటకాలు ఆడారాని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుబట్టారు.

 

వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు" అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. "ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా?" అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, సీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆమె విమర్శించారు.

 

 

 

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. "ఎవరిని మోసం చేయడానికి ఇద్దరూ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు? మోదీ దగ్గర సాగిలపడి సీమకు అన్యాయం చేస్తారా?" అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: అక్కపై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Pagadala Venkateswar 2026-02-11 11:24:39 0 187
Jammu & Kashmir
Apple Orchards in Ruins: Hailstorms Decimate Kashmir’s Fruit Economy
A catastrophic wave of unseasonal rain and severe hailstorms has ravaged the horticulture...
By Dunna Jessicaruth 2026-05-14 07:41:12 0 191
SURAKSHA
Kalaivanan S., IPS: Advancing Excellence in Policing
The Journey begins "The strength of a police force is measured by the confidence...
By Fathima Safa 2026-07-27 13:22:05 0 175
SURAKSHA
Hari Chandana Dasari IAS: Driving Innovation in Governance
A visionary Telangana IAS officer transforming governance through sustainability, innovation,...
By Lokeshwari Panthadi 2026-07-10 11:01:13 0 180
SURAKSHA
Dial 112 Modernization Ensures Karnataka Police Reaches
Karnataka Police upgraded Dial 112 emergency service for faster help. Once you call, GPS traces...
By Kalaga Sailaja 2026-07-01 11:20:36 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com