LV Subrahmanyam: శ్రీవారి నెయ్యి కోసం సొంత వ్యవస్థ ఉండాలి: ఎల్వీ సుబ్రహ్మణ్యం.

0
188

అమూల్ నమూనాలో రైతుల నుంచి పాలు సేకరించాలని ఎల్వీ సూచన 

గత ప్రభుత్వంలో జరిగింది క్షమించరాని మహాపచారమని వ్యాఖ్య 

బాధ్యులు తప్పు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ 

తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం వినియోగించే నెయ్యి సరఫరాకు పకడ్బందీగా సొంత వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దీని కోసం గుజరాత్‌లోని అమూల్ నమూనాను అనుసరించాలని టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి (ఈవో), విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులను దేశీ ఆవుల పెంపకానికి ప్రోత్సహించి, వారి నుంచి పాలను సేకరించాలన్నారు. స్వామికి సమర్పించుకుంటున్నామనే భక్తిభావంతో రైతులు పాలు పోస్తారు కాబట్టి, ఆ పాలతో టీటీడీయే స్వయంగా నెయ్యి తయారుచేస్తే నాణ్యతకు ఢోకా ఉండదని, వేల రైతు కుటుంబాలకు ఉపాధి కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.   

 

గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న వివాదం నేపథ్యంలో ఆయన ఈనాడుతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరిగింది క్షమించరాని మహాపచారం అని, మానవాళికే శాపమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలియక జరిగిన పొరపాటు కాదని, నెయ్యిలా కనిపించేందుకు ఏ రసాయనాలు కలపాలో వెతికి మరీ చేసిన నేరపూరిత కుట్ర అని ఆరోపించారు. 2022లోనే ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి కల్తీ అని తేలినా, దాని వాడకాన్ని కొనసాగించడం క్షమించరానిదన్నారు.

 

"జంతు కొవ్వు కలపలేదు, రసాయనాలే కలిపాం అని సమర్థించుకోవడం సిగ్గుచేటు. ఇది అపచారం కాదా?" అని ఆయన నిలదీశారు. ఈ పాపానికి బాధ్యులైన వారు తమ వాదనలు ఆపి, తిరుమలకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేవస్థానం వ్యవహారాల్లో ఈవో, ఛైర్మన్ ఇద్దరూ సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం, టీటీడీ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 277
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 315
Andhra Pradesh
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...
By Benguluri Madhubabu 2026-01-18 06:36:15 0 338
Telangana
కాంగ్రెస్ పార్టీకి కళ్లెం బిక్షపతి సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 25 రాజపేట మండలం కాలువ పెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్...
By Pindikura Mahesh 2026-05-25 16:19:45 0 155
BMA
The Fourth Estate: Judiciary Validates Press Power
The true strength of the media lies in its institutional recognition as the Fourth Estate of...
By JoinBMA 2026-08-21 10:07:08 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com