Jogi Ramesh: జోగి రమేశ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు.

0
203

బెయిల్ పై ఉన్న జోగి రమేశ్ కు మరో షాక్

జగన్ పర్యటన సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కేసు

పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన ఎస్సై

కల్తీ మద్యం కేసులో ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు మరో షాక్ తగిలింది. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: ( 143, 188, 290, 336, 341, 353 r/w 149 IPC) సెక్షన్ల కింద కేసు నమోదయింది. 

 

కేసు వివరాల్లోకి వెళితే... జోగి రమేశ్ ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ నిన్న ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీలు, పబ్లిక్ న్యూసెన్స్, జన సమీకరణ చేశారని ఎస్సై రవి వర్మ ఫిర్యాదు చేశారు. రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని తెలిపారు. జన సమీకరణ, ర్యాలీలు చేపట్టవద్దని కఠిన నిబంధనలు విధించినా... వాటిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 

 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూడా జోగి రమేశ్ పై మరో కేసు నమోదయింది. పోలీసులు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు పెట్టారు. సెక్షన్ 223, 189 క్లాజ్ 2, 292, 125క్లాజ్ 2, 126క్లాజ్ 2, 132, 190, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ను మళ్లీ అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ...
By John Baji 2026-01-22 01:35:32 0 254
Gujarat
Water Resource Management and Conservation in Gujarat
Gujarat has intensified its focus on water resource management and conservation to ensure...
By Fathima Safa 2026-06-23 05:30:15 0 119
Andhra Pradesh
బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-04-14 07:10:10 0 191
SURAKSHA
Sharad Satya Chauhan IPS: Driving Punjab Police Growth
Sharad Satya Chauhan, IPS – A Visionary Leader Strengthening Punjab Police Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-25 11:25:31 0 208
Andhra Pradesh
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర...
By Chennaiah Kati 2026-07-12 13:50:03 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com