మార్కాపురంలో ఘనంగా 'రోడ్డు సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.

0
246

మార్కాపురంలో ఘనంగా 'రోడ్ సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు మార్కాపురం టౌన్ లో ఘనంగా రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు జాయింట్ కలెక్టర్, మార్కాపురం, ఎస్‌డీపీవో, మార్కాపురం, మార్కాపురం శాసనసభ్యులు, పోలీస్ అధికారులు, పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, వాహన డ్రైవర్లు, సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలు, వేగ నియంత్రణ, మొబైల్ ఫోన్ వినియోగం నివారణ వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

విద్యార్థులు ప్రదర్శించిన నినాదాలు, ప్లకార్డులు ప్రజల్లో మంచి స్పందనను పొందాయి.

అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై స్పష్టత పెరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ర్యాలీ నిర్వహణలో మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ వాహనాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడు
Breaking..                       ...
By Rajini Kumari 2026-01-25 11:00:47 0 223
Telangana
ప్లాన్ బితో మంగ్లీకి షాకిచ్చిన అడ్వకేట్ సుబ్బారావు.. ముదురుతున్న చీటింగ్ కేసు వివాదం!
ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి....
By Ponnala Srinivasrao 2026-04-17 02:01:10 0 174
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 1K
Chandigarh
Chandigarh Strengthens Disaster Management Preparedness
Chandigarh is enhancing its disaster management framework through improved emergency...
By Fathima Safa 2026-07-02 06:16:17 0 198
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. గత కొద్ది...
By Ponnala Srinivasrao 2026-07-31 02:15:05 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com