చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం
Posted 2026-02-04 16:35:59
0
221
చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, నేర నియంత్రణకు పోలీస్ శాఖలోని అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు తగిన న్యాయం చేకూర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చట్ట పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తానని, ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి...
MPTC, ZPTC elections are postponed...
As the grama panchayat elections are completed the telangana state election commission had...
Bengaluru Police Plant Trees With School Children
: Bengaluru Police today partnered with school children for a tree plantation drive on...
బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషిచేసిన ఎర్రం నాయుడు
*ప్రచురణార్థం* *23-02-2026*
*బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన...
హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్...