ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...

0
615

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కూలీలు చెట్లు నరికే పనుల కోసం ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరాంపురం గ్రామం నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెట్లు నరికే పనుల నిమిత్తం 14 మంది కూలీలతో ఆటో బయలుదేరింది. ఈ క్రమంలో కత్తిపూడి వద్ద పిఠాపురం నుంచి రౌతులపూడి వైపు వెళుతున్న టిప్పర్ లారీని ఆటో బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమవ్వగా, అందులో ప్రయాణిస్తున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు.

ఈ ప్రమాదంలో శ్రీరాంపురం గ్రామానికి చెందిన పితాని కామరాజు (65) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో పన్నెండు మంది కూలీలు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని ఆటోల్లో, అంబులెన్సుల్లో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #దడాల babji

Search
Categories
Read More
Andhra Pradesh
టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ
సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ...
By Boiena Rajesh 2026-07-18 05:17:04 0 178
Andhra Pradesh
సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-23 06:46:23 0 204
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 3K
Telangana
ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
By Prashanth Goindla 2026-02-10 13:42:04 0 591
SURAKSHA
T. K. Vinod Kumar IPS: A Symbol of Courage and Leadership
Introduction – A Leader Who Believes Policing Begins with Public Trust "Law enforcement is...
By Fathima Safa 2026-07-16 06:16:07 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com