ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

0
272

ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.

 బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల పరిధిలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలో, పొలాల్లోని ట్రాన్స్-ఫార్మర్లు మరియు కాలేజీ బిల్డింగ్ లోని రాగివైర్లు దొంగిలించిన ఐదుగురు ముద్దాయిలను బల్లికురవ SI నాగరాజు బల్లికురవ పాత బస్టాండ్ వద్ద అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 4 లక్షల 40 వేల విలువైన రాగితీగను స్వాధీనపరచుకున్నారు.

 అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు: 

1.కొమరగిరి ప్రసాద్ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, పిన్నివారిపాలెం గ్రామం, బాపట్ల మండల & జిల్లా, 

2.కాశిమళ్ళ శ్యాంబాబు తండ్రి ఏడుకొండలు, వయస్సు 22 సం’’లు,మిన్నికల్లు గ్రామం, సంతమాగులూరు మండలం, 

3.ఈగ లక్ష్మినారాయణ తండ్రి సుబ్బారావు, వయస్సు 21 సం’’లు, రామకృష్ణాపురం, బాపట్ల టౌన్,

 4.కల్లూరి ఏసోబు తండ్రి ప్రసాద్, వయస్సు 20 సం’’లు, కొత్త నందాయిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా, 

5.రావినూతల రాజశేఖర్ @ విశాల్ తండ్రి డేవిడ్, వయస్సు 20 సం’’లు, నల్లమోతువారిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా .                  

 చేదించిన కేసులు మరియు రికవరీ వివరాలు: 

బల్లికురవ మండల పరిధిలో నమోదైన 3 కేసుల్లో రాగితీగ ( 50 Kg);

 నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 30 Kg);

 అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ( 20 Kg);

 బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో రాగితీగ;

–మొత్తం 6 కేసుల్లో 100 Kg ల రాగితీగ (సుమారు 4 లక్షల 40 వేల రూపాయల విలువ) రికవరీ చేయబడ్డాయి.

 ముద్దాయిల నేపథ్యం మరియు చోరీ విధానం: 

ఈ ఐదుగురు ముద్దాయిలు బాపట్ల జిల్లా కు చెందినవారు అయి ఉండి వృత్తిరీత్యా కూలిపనులు చేయడం వలన జీవనోపాధి. అయితే, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు, తమ పని నుండి సరిపడా ఆదాయం రాకపోవడంతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. గత రెండు నెలలుగా రాత్రి సమయాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, రాగి వైర్లు దొంగిలించి, వాటిని అమ్ముకుని తమ చెడు వ్యసనాలను తీర్చుకునేందుకు ఈ దొంగతనాలను అలవాటు చేసుకున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.

ఈ కేసు చేధనను స్వయంగా పర్యవేక్షించిన దర్శి DSP.బి.లక్ష్మినారాయణ, సంతమాగులూరు సిఐ కె,వెంకటరావు, బల్లికురవ SI వై.నాగరాజు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు అభినందించారు.

Search
Categories
Read More
Telangana
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్  అమెరికాలోని...
By Pinnehasan Odela 2026-01-16 09:18:22 0 359
Andhra Pradesh
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
By Pagadala Venkateswar 2026-01-23 07:00:17 0 208
Haryana
Haryana Launches "War on Dengue" to Combat Monsoon Outbreaks
In a proactive move to safeguard public health during the monsoon season, the Haryana state...
By Lokeshwari Panthadi 2026-07-01 09:02:32 0 117
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...
By Kothuru Murali 2026-03-31 05:26:21 0 183
Telangana
మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ
WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..! భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున ...
By Gujile Ramu 2026-05-10 09:48:10 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com