సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|

0
246

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి అందులోని ఫోన్ పే ద్వారా అక్షరాల 8 లక్షల రూపాయలు దొంగిలించుకున్న దొంగను సూరారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి  రూ. 6.73 లక్షల నగదు తో పాటు దొంగలించిన మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూరారం ఎస్ హెచ్ ఓ  సుధీర్ కృష్ణ తెలిపిన ఘటన వివరాలు:

జనవరి 07- 2026 తెల్లవారుజామున, నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో పేషంట్ వద్ద  ఒక సెల్ ఫోన్  చోరీకి గురైంది.  నిందితుడు ఆ ఫోన్లో ని మొబైల్ నుండి ఫోన్ పే  అప్లికేషన్ ఉపయోగించి బాధితుడి ఖాతా నుండి తన ఖాతాకు 8 లక్షల రూపాయలను  తన ఖాతకు మళ్ళించాడు. 

ఈ భారీ మోసంపై జనవరి 23న దరోజు ప్రవీణ్ కుమార్ సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

దీంతో సూరారం పోలీస్ క్రైమ్ టీ రంగంలోకి దిగి, ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టింది. నిందితుడు నగదు బదిలీ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడి నుండి రూ. 6.73000 వేల నగదు, మరియు దొంగిలించిన మొబైల్ ఫోన్ ను రికవరీ చేశారని,.  స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు ఏడు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన వెల్లడించారు.

అరెస్టు అయిన నిందితుడు మెదక్ జిల్లా కౌడిపల్లి కి చెందిన బురడ ఆదినారాయణ(34) ఇతను వృత్తిరీత్యా సెంట్రింగ్ పనులు చేస్తాడని  తెలిపారు. 

కేసును అత్యంత వేగంగా ఛేదించి రికవరీ చేసిన సూరారం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రజలు తమ మొబైల్ ఫోన్లకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలని, ముఖ్యంగా యూపీఐ పిన్ నంబర్  విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ హెచ్. ఓ సూచించారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.
మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా...
By Pagadala Venkateswar 2026-07-24 05:26:59 0 99
Andhra Pradesh
దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు
దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత...
By Chennaiah Kati 2026-03-10 13:14:04 0 401
Andhra Pradesh
ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ
*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*   *ఆరోగ్యం, కాలుష్య...
By Rajini Kumari 2025-12-28 09:51:47 0 209
Telangana
జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ షాప్ ల యజమానులకు పోలీసుల హెచ్చరిక.|
హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాల్,...
By Sidhu Maroju 2025-11-27 10:41:20 0 229
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:01:39 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com