గోవా బీచ్ స్థాయిలో సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా బాపట్ల మారిపోతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు.

0
1K

బాపట్ల: సూర్యలంక బీచ్, పాండురంగాపురం బీచ్ లను సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందం, జిల్లా కలెక్టర్ కలిసి మంగళవారం పర్యటించారు. సూర్యలంక బీచ్ లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పర్యాటక అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించారు. సూర్యలంక బీచ్ గుంతలు లేకుండా సజావుగా సురక్షితమైన ప్రాంతమని చెప్పారు. సున్నితమైన సన్న ఇసుక, పరిశుభ్రంగా ఉండే బీచ్ సూర్యలంక కావడం దీని ప్రత్యేకత అని వివరించారు. రైలు, బస్సులు సౌకర్యం జిల్లా కేంద్రానికి ఉండగా, అక్కడి నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సూర్యలంక బీచ్ ఉండడం పర్యాటకులకు అనువైన ప్రాంతంగా చెప్పారు.  భారత వైమానిక దళం సూర్యలంక బీచ్ కు సమీపంలో ఉండడం సురక్షిత ప్రాంతం అన్నారు. ఇక్కడ ఒంటెలు, గుర్రాలపై స్వారీ చేయడం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయన్నారు. ప్రతిరోజు సాధారణంగా సూర్యలంక బీచ్ కు మూడు నుంచి నాలుగు వేలమంది పర్యాటకులు వస్తుంటారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వదేశీ దర్శన్ కింద సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. ఎంతోకాలంగా ఎండు చేపలు, ఎండు రొయ్యల విక్రయాలు, సముద్ర జలాల నుంచి లభించే తాజా ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయన్నారు. పర్యాటకులను కనువిందు చేసే అనువైన ప్రాంతం ఈ బీచ్ కావడంతోనే సెప్టెంబర్ లోగా అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వర్ణించారు. పార్కు, అంతర్గత రహదారుల నిర్మాణం, దుకాణాలు, పర్యాటకులను అలరించే వివిధ నిర్మాణాల గురించి ఆయన తెలిపారు.
         
          బయో ఫ్లాగ్ టెక్నాలజీతో చేపట్టిన రొయ్యల సాగు యూనిట్ ను కలెక్టర్, సింగపూర్ అధికారుల బృందం పరిశీలించింది. అడవి పంచాయతీలో సురేష్ అనే ఆక్వా రైతు 5 ఎకరాలలో ప్రారంభించిన రొయ్యల సాగు పరిశ్రమను బృందం పరిశీలించింది. పర్యావరణానికి ఎలాంటి హాని లేని బయో ఫ్లాగ్ టెక్నాలజీతో నూట ఇరవై మిలియన్ రొయ్య పిల్లల ఉత్పత్తి ఒకేసారి చేపట్టడం అభినందనీయమని దక్షిణాసియా మిడ్డిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా, సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్ తెలిపారు. సదరు రైతు సురేష్ తో సింగపూర్ అధికారులు మాట్లాడారు. ఈ సాగు వల్ల లాభనష్టాలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, అధిక దిగుబడులు వచ్చే నూతన విధానంలో ప్రభుత్వం సహాయంపై ఆరా తీశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే రొయ్య పిల్లలను వివిధ ప్రాంతాలకు విక్రయించడం, తదుపరి రొయ్య సాగుతో ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాదికి ఐదుసార్లు పంట చేతికి వస్తుందని, ప్రభుత్వం సహాయంతోనే ఈ సాగు చేస్తున్నానని రైతు వివరించారు. స్థానిక ప్రజలు రొయ్యల వినియోగం తక్కువగానే ఉంటుందని కలెక్టర్ కు విన్నవించారు. 
           
         పర్యటనలో సింగపూర్ ఎకానమిక్ కన్సల్టెంట్ ప్రైస్ సీఈవో చూతోక హిమ్, సింగపూర్ కోపరేషన్ ఎంటర్ ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ త్యాలైన్ చీవో, సింగపూర్  సస్టైనబిలిటీ స్టాటజిక్ ప్రాజెక్ట్ సీనియర్ మేనేజర్ నిషశర్ధ, రాష్ట్ర ఆర్థిక ఘనంగా శాఖ డైరెక్టర్ బి గోపాల్, ఆర్ డి ఓ పి గ్లోరియా, మత్స్య శాఖ జెడి శ్రీనివాస్ నాయక్, డిడి గాలి దేముడు, తదితరులు ఉన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఒంటిమిట్ట అడివిలో దారుణ హత్య
కడప జిల్లా కడప నగరం సమీపంలోని ఒంటిమిట్ట అడివిలో డ్రైవర్ అక్కుపల్లి వంశీ 25 ఇయర్స్ దారుణ హత్య కడప...
By Benguluri Madhubabu 2026-06-13 03:33:55 0 185
BMA
Reader Trust Revived: Monetizing In-Depth Journalism
The broken digital advertising model forces outlets to produce high-volume clickbait, eroding...
By JoinBMA 2026-08-24 05:55:30 0 160
Andhra Pradesh
అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి సుగంధ ద్రవ్య మర్దన
శ్రీకాకుళం మండలంలోని అరసవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య...
By Manda Ramkumar 2026-03-29 00:18:09 0 496
SURAKSHA
Telangana Retired Police: Serving People Without Uniform
Retirement తర్వాత Telangana Police officers uniform లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. Slum areas...
By Kalaga Sailaja 2026-07-03 11:26:19 0 84
Telangana
తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం
తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి...
By Ponnala Srinivasrao 2026-05-06 04:20:13 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com