సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU

0
1K

 

​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో డీఏలను చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల ప్రస్తుతం అవి 60కి చేరాయని తెలిపారు. ఈ వాయిదాల ద్వారా రావలసిన మొత్తం సుమారు రూ. 1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

​ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న రూ. 700 కోట్ల నిధులలో భాగంగా ఈ నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో TSCPSEU మండల అధ్యక్షుడు వాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సువర్ణపాక కృష్ణ, మండల బాధ్యులు జాడి ప్రభాకర్, సుభాష్, మహిళా కార్యదర్శి రాజేంద్ర, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీపీఎస్ సంఘ బాధ్యులు, మరియు పలువురు సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి
🏅 ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి   నిజామాబాద్ పోలీస్...
By Chakrala Sadhanand 2026-08-14 17:14:44 0 220
Andhra Pradesh
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఉద్యమం ఉదృతం ఆదర్స్ ఎం సాజి
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా.. విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమం ఉధృతం : ఆదర్శ్ ఎం సాజి...
By Rajini Kumari 2025-12-16 07:14:06 0 236
Andhra Pradesh
పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి...
By Kothuru Murali 2026-02-10 07:31:56 0 259
Andhra Pradesh
YS Vijayamma: ఆస్తుల వివాదం.. ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ.
కుటుంబంలో ఆస్తుల పంపిణీ వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె...
By Pagadala Venkateswar 2026-03-18 03:13:55 0 222
Telangana
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC...
By Pinnehasan Odela 2026-01-17 06:35:57 0 490
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com