అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు రానున్న జగన్ మోహన్ రెడ్డి.

0
191

గుంటూరు :ఈ రోజు 03.02.2026 మంగళవారం ఉదయం, మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి రేపటి గుంటూరు పర్యటన సందర్భంగా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ నేతలతో కలసి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు *శ్రీమతి మేకతోటి సుచరిత* గారు. తదుపరి మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారి గృహంను ముఖ్య నాయకులతో కలసి సందర్శించి అక్కడ టి.డి.పి.అల్లరిమూకల పైసాచిక దహన, దమనకాండ దృశ్యాలను పరిశీలించి, శ్రీ అంబటి రాంబాబు గారి భార్య, కుమార్తెలను ఓదార్చి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకర్ల సమావేశంలో శ్రీమతి సుచరిత గారు మాట్లాడుతూ గతంలో గుంటూరులో ఎన్నడు చూడని విధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి గృహం మీద దాడి చేసి, వయస్సుని కూడా చూడకుండా వారి కుటుంబాన్ని ఏవిధంగా బయపెట్టారో రాష్ట్రం మొత్తం చూడటం జరిగింది. అలానే వారి కుమార్తె మా నాన్న గారిని శారీరకంగా హింసించి, మానసికంగా వేదిస్తున్నారని ఆవేదనతో చెప్పారు. మహిళలు ఉన్నటువంటి ఇంటిలో, ఒక మహిళా ఎం.ఎల్.ఏ. అయ్యిండి, రాంబాబు గారి కుటుంభంపై దాడిచేయించటం అమానుషం అని అన్నారు. శాంతి భద్రతలు కాపాడాలిసిన పోలీసులు, దగ్గరుండి ఈ దమనకాండకు వంతపాడటం, ఏ యుగంలో ఉన్నామో అర్ధం కావటంలేదు. డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలుచేయకుండా, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని తెలిపారు. ఈలాంటి పరిష్టితులలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను రాష్ట్రపతికి నివేదించి, గవర్నర్ పాలన పెట్టాలని కోరారు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు రేపు అనగా బుధవారం శ్రీ రాంబాబు గారి కుటుంభ సభ్యులను పరామర్శించి, సంఘీభావం తెలుపుటకు వస్తున్నారు అని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...
By G k Nookala 2026-03-05 10:34:37 0 187
Bharat Aawaz
RBI Monetary Policy Update – August 2025
RBI Monetary Policy Update – August 2025 The Reserve Bank of India’s Monetary Policy...
By Bharat Aawaz 2025-08-06 06:17:27 0 1K
SURAKSHA
S. Ananthakrishnan IPS: Leading Kerala with Integrity & Vision
The Hook "A police officer's greatest achievement is not measured by fear, but...
By Fathima Safa 2026-07-16 07:43:45 0 161
Legal
Supreme Court Declines to Modify Landmark Public Safety Order on Stray Dogs
In a major decision, the Supreme Court of India refused to modify its previous directives...
By Dunna Jessicaruth 2026-05-19 11:24:32 0 292
Andhra Pradesh
పుంగనూరు: 108 అంబులెన్స్ లో ఉద్యోగ అవకాశలు.
చిత్తూరు జిల్లాలో 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల్లో పైలట్ (డ్రైవర్) పోస్టులకు దరఖాస్తులు...
By Kothuru Murali 2026-01-20 13:57:59 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com