మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

0
380

పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైనటువంటి *మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం, పాడి, పంట సమృద్ధిగా ఉంటేనే రైతు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి.

 కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మినీ గోకులం (పశువుల షెడ్డు) లను పూర్తిగా 100% MGNRGS నిధుల నుండి 25మంది లబ్దిదారులకు 4954000/- రూపాయల వరకు నిధులు మంజూరు చేయటం జరిగింది. పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హతగల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, పొన్నూరు నియోజకవర్గ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ్లమూడి బాబురావు, గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చలమశెట్టి సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లూరి వెంకట అప్పారావు, దేశం శెట్టి సూర్య,MPDO గుమ్మడి చంద్రశేఖర రావు, APO సుభాషిణి, APM జోజి బాబు, EOPRD శ్రీనివాస రావు, వివిధ గ్రామాల కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 252
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 215
Andhra Pradesh
సమస్య విన్న వెంటనే పరిష్కరించే గొప్ప నాయకుడు దొరికారు
వేటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన సర్వోదయ కాలనీ కి వెళ్లే రోడ్డులొ సరియైన ర్యాంపు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 17:03:03 0 337
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:04:07 0 158
Telangana
తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో ...
By Ponnala Srinivasrao 2026-04-20 01:31:35 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com