Pawan Kalyan: ప్రతిదానికీ నేనే స్పందిస్తుంటే మీరెందుకు ఉన్నట్టు?: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ అసంతృప్తి!

0
182

అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం

 

తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశం

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

2026 స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపు

కూటమిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వద్దని సూచన

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైనా తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీరెందుకు ఉన్నట్టని మందలించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు.

 

ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు, కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు, బెదిరింపులకు లొంగవద్దని హెచ్చరించారు.

 

"వైసీపీ నేతలు వేసే ఉచ్చులో పడొద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి" అని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా, విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా, కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

 

ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 263
Andhra Pradesh
రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన...
By Pagadala Venkateswar 2026-06-30 07:14:51 0 125
SURAKSHA
Idashisha Nongrang, IPS: Meghalaya's Trailblazing Leader
A distinguished 1992-batch Indian Police Service officer of the Assam–Meghalaya cadre,...
By Lokeshwari Panthadi 2026-07-22 13:37:30 0 179
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్, మే 25:...
By Chunarkar Jagadeesh 2026-05-25 10:34:10 0 500
Andhra Pradesh
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
By Benguluri Madhubabu 2026-01-22 04:32:02 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com