Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

0
180

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం

వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

 

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు. 

 

సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత కేబినెట్‌లో 30కి పైగా అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కావడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండొచ్చని అంచనా. 

 

కేబినెట్‌ సమావేశం ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు, అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నేతలకు సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత
శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ...
By Kothuru Murali 2026-04-25 03:36:07 0 125
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 346
Nagaland
Municipal Body Merger Officially Recognized
The State Election Commission (SEC) has officially recognized the merger of the Nationalist...
By Dunna Jessicaruth 2026-05-16 07:08:19 0 139
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:27:32 0 198
Maharashtra
Maharashtra Enhances Digital Governance and Citizen Services
Maharashtra is accelerating digital governance by expanding e-governance platforms and improving...
By Fathima Safa 2026-06-30 09:20:20 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com