చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

0
202

వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి. 

చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

రేపు కసుమూరు లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అన్నదాన సత్రం ప్రారంభం.

హాజరుకానున్న మైనారిటీ మంత్రి శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్.

గతంలో ఎప్పుడూ లేని విధంగా, వక్ఫ్ బోర్డు చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఆయన నాయకత్వంలో ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో కసుమూరు లో నిత్య అన్నదాన సత్రం (లంగర్ ఖానా) తో పాటు “తాలిం-ఎ-హునార్” పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మైనారిటీ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు పనబాక లక్ష్మి హాజరుకానున్నారు. పేదలు, అనాధలు, దర్గా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజూ భోజనం అందించడమే లక్ష్యంగా నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం విశేషం. అదే సమయంలో, మైనారిటీ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు “తాలిం-ఎ-హునార్” స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం వక్ఫ్ బోర్డు సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. ప్రథమంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ల శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులు కేవలం పరిరక్షణకే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలి. నిత్య అన్నదానం, నైపుణ్య శిక్షణ ద్వారా వక్ఫ్ బోర్డు సామాజిక సేవలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది అని తెలిపారు. స్థానికులు, ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇది మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్...
By Sunka Santhosh 2026-05-21 14:38:55 0 209
Telangana
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-09-03 11:47:34 0 114
Andhra Pradesh
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు..
👉 జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు.. 👉 రోడ్డు ప్రమాదాల...
By Chennaiah Kati 2026-06-22 05:21:27 0 100
Andhra Pradesh
Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.
Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు...
By Pagadala Venkateswar 2026-07-18 06:57:23 0 86
Andhra Pradesh
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు
అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా...
By Chennaiah Kati 2026-07-12 13:14:12 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com