Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్.

0
187

Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్

02-02-2026 Mon 14:04 | Andhra

Anagani Satya Prasad Slams YCP as Virus for Andhra Pradesh Development

రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు జగన్ ముఠా కుట్రలు చేస్తోంద‌న్న మంత్రి

వైసీపీ హయాంలో లడ్డూ కోసం 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడార‌ని ఆరోప‌ణ‌

 

చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతవారైనా శిక్ష తప్పదన్న అనగాని 

టీడీపీ ఎజెండా అభివృద్ధి, విధ్వంసం కాదని స్ప‌ష్టీక‌ర‌ణ‌

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, అశాంతిని రెచ్చగొట్టేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన 'సైకో ముఠా' కుట్రలు పన్నుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా బూతులు తిట్టడం, కులాలు-మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ సిద్ధాంతమని ఆయన విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి జగన్ ఒక వైరస్‌లా మారారని మండిపడ్డారు.

 

లడ్డూలో 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో భారీ కుంభకోణం జరిగిందని అనగాని సంచలన ఆరోపణలు చేశారు. చుక్క పాలు కూడా వాడకుండా, జంతువుల కొవ్వుతో తయారు చేసిన 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వినియోగించారని తెలిపారు. ఇదే విషయాన్ని సెట్ నివేదిక స్పష్టం చేసిందని, కానీ వైసీపీ నేతలు రిపోర్టులను తారుమారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

 

ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దొరికిపోయిన దొంగ భూమన కరుణాకర్ రెడ్డి అని, ఇప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తిరుపతిలో ఫ్లెక్సీలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని, 'యథా రాజా తథా ప్రజా' అన్నట్టు జగన్‌ను చూసి భూమన, అంబటి వంటి నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

అభివృద్ధే టీడీపీ ఎజెండా

విధ్వంసం సృష్టించడం కాదని, అభివృద్ధే టీడీపీ అజెండా అని అనగాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 20 గంటలు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని, పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, జగన్, ఆయన ముఠా రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తోట చంద్రయ్య, అమర్ అనే బాలుడి హత్య కేసుల్లో బాధితులకు న్యాయం చేస్తామని, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, దాడులు చేయడం మన పార్టీ సంస్కృతి కాదని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఎంతటివారైనా చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వైసీపీ బూతు రాజకీయాలను, కుట్రలను ప్రతి వేదికపై ఎండగడతామని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ...
By Kothuru Murali 2026-07-08 10:01:57 0 150
Andhra Pradesh
స్వయంగా రక్తదానం చేసి సేవాస్పూర్తికి నిదర్శంగా నిలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ...
By Benguluri Madhubabu 2026-06-13 08:21:43 0 189
Telangana
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని...
By Sidhu Maroju 2026-03-29 07:00:14 0 181
SURAKSHA
Breaking Barriers: The Visionary Leadership of Anu Garg
A Trailblazer at the Helm: Odisha’s First Woman Chief Secretary:  History is often...
By Kalaga Sailaja 2026-07-18 07:48:31 0 139
Andhra Pradesh
నగరాభివృద్ధిపై సీఎం దృష్టి కేశినేని శివనాథ్ వ్యాఖ్యలు
*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*   *విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధి పై...
By Rajini Kumari 2026-01-14 12:43:48 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com