Anil Kumar Singhal: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ... రవిచంద్రకు బాధ్యతలు.

0
205

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు 

సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్రకు అదనపు బాధ్యతలు

 

నేడు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 1న) ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

 

1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్, 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

 

కాగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

Search
Categories
Read More
International
In Dubai all airports are closed due to the war
దుబాయ్‌లో అన్ని విమానాశ్రయాలు మూసివేత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని...
By G k Nookala 2026-02-28 14:53:03 0 468
Andhra Pradesh
పుంగనూరులో ఎంవీఐ సుప్రియ ఆకస్మిక తనిఖీలు: వాహనదారులకు హెచ్చరిక
పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు...
By Kothuru Murali 2026-06-24 16:31:54 0 91
Andhra Pradesh
ఏఐటీయూ 18వ మహాసభలు
*ఎమ్మిగనూరు నియోజకవర్గం AITUC 18, వ మహాసభలు పాత మున్సిపల్ ఓపెన్ థియేటర్ లో నిర్వహించడం జరిగింది.*...
By Boya Dasthagiri 2026-03-23 12:22:02 0 340
Andhra Pradesh
నందిగామ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నందిగామలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన...
By Patan Khuddus 2026-04-22 09:47:31 0 320
Dadra &Nager Haveli, Daman &Diu
Tourism Infrastructure and Eco-Tourism Growth in 2026
Tourism infrastructure and eco-tourism initiatives gained momentum in 2026, supporting...
By Fathima Safa 2026-06-22 10:31:43 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com