Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!

0
249

రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత

ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌

 

కోచింగ్ లేకుండానే కొట్టిన లక్ష్మీదీపిక

తదుపరి లక్ష్యం సివిల్స్ అంటూ వెల్లడి

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి. ఇటీవలే తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన ఆమె, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానికేతర కోటాలో ఏపీ పరీక్ష రాసినప్పటికీ, తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచారు.

 

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన లక్ష్మీదీపిక కుటుంబ నేపథ్యం అంతా ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడి ఉంది. తండ్రి కృష్ణది కోనసీమ జిల్లా అమలాపురం కాగా, తల్లి పద్మావతిది పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం ఆమె తెలంగాణ గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై శిక్షణలో ఉన్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే పోస్టు రావడంతో, ఎక్కడ కొనసాగాలనే విషయంపై ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 

లక్ష్మీదీపిక విద్యాభ్యాసం అంతా మెరిటోరియస్‌గా సాగింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు అడుగులు వేశారు. గతంలో ఏపీలో ఎంపీడీవో పోస్టు వచ్చినప్పటికీ, తన లక్ష్యం కోసం ఆ ఉద్యోగంలో చేరలేదు. యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న క్రమంలోనే ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండా, కేవలం సివిల్స్ ప్రిపరేషన్‌తోనే రెండు రాష్ట్రాల గ్రూప్-1 పరీక్షల్లో టాపర్‌గా నిలవడం విశేషం.

 

పరీక్షల సమయంలో రోజుకు ఆరు గంటలు మాత్రమే చదివినట్లు లక్ష్మీదీపిక తెలిపారు. గ్రూప్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులు ఉండవు కాబట్టి జనరల్ స్టడీస్‌పై పట్టు సాధించడం తనకు కలిసి వచ్చిందని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఆమె, తన అంతిమ లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని స్పష్టం చేశారు. ఒకే అభ్యర్థి రెండు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Search
Categories
Read More
Telangana
"కాలేశ్వరం తీర్పు: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ విక్టరీ సెలబ్రేషన్స్!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల...
By Sidhu Maroju 2026-04-23 10:26:18 0 196
Andhra Pradesh
AP New Scheme: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభానికి రెడీ.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్దమైంది. గరుడ పేరుతో కొత్త...
By Pagadala Venkateswar 2026-01-13 12:00:59 0 238
Telangana
బ్రేకింగ్ న్యూస్
    రేపు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు   #sidhumaroju  Alwal 
By Sidhu Maroju 2026-03-27 17:04:16 0 197
Andhra Pradesh
మదనపల్లె: ఆడవేషంలో ఎన్నో మోసాలు.
మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి....
By Pagadala Venkateswar 2026-06-05 07:23:40 0 107
Telangana
మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్
మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం...
By Avunoori Mahesh 2026-09-20 05:56:55 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com