Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.

0
382

2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం

 

ప్రధాన ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచన

రాష్ట్రంలో గుంతల్లేని రోడ్ల కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి

రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూ.42,194 కోట్ల విలువైన పనులను వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని ఆకాంక్షించారు.

 

రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రహదారుల ప్రాజెక్టులు చేపట్టాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ శాఖల ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

 

శ్రీకాకుళంలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సీఎం సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ పోర్టులకు సరుకు రవాణా జరిగేలా రోడ్లను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. ఖరగ్‌పూర్-అమరావతి, నాగ్‌పూర్-విజయవాడ, రాయ్‌పూర్-అమరావతి వంటి కీలకమైన కారిడార్ల డీపీఆర్‌లను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

 

రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ల రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, వేస్ట్ ప్లాస్టిక్, నానో కాంక్రీట్ వంటి ఆధునిక టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు
మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని...
By Ponnala Srinivasrao 2026-04-01 11:39:06 0 285
SURAKSHA
Women Police Teams Enhance Safety In Bus Stands Andhra
 Vijayawada, Visakhapatnam bus stands lo She Teams & Women Police patrols perginchayi....
By Kalaga Sailaja 2026-07-01 04:48:02 0 108
Andhra Pradesh
జగ్గయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం అశోక్ గుండెపోటుతో మృతి అసిస్టెంట్
జగ్గయ్యపేట మండలం  జయంతిపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అశోక్ గుండె పోటుతో మృతి...
By Rajini Kumari 2026-02-10 10:39:10 0 230
Andhra Pradesh
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
By Mobbu Venkatramana 2026-01-07 04:20:05 1 2K
Andhra Pradesh
పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-14 08:43:50 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com