Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.

0
201

Andhra

Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday

 

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తల్లి పుట్టినరోజు సందర్భంగా రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత

జూలో నూతన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ప్రారంభించిన వైనం

జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు

కంభాలకొండలో 'నగర వనం' ప్రారంభించి, కనోపీ వాక్

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా, తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటి సంరక్షణకు ఏడాది పాటు అయ్యే ఖర్చును తానే పూర్తిగా భరిస్తానని తెలిపారు.

 

ఈ స్ఫూర్తితో జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా, జూపార్క్‌లో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏనుగులు, నీటి ఏనుగులు, పులులు, సింహాల ఎన్‍క్లోజర్ల వద్దకు వెళ్లి వాటి వివరాలను జూ క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. జూ నిబంధనలు పాటిస్తూ ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందించారు.

 

అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్, అక్కడ ఏర్పాటు చేసిన 'నగర వనం'ను ప్రారంభించారు. పార్క్‌లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ, మార్గమధ్యలో ఉన్న మొక్కల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
జై సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   *జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-23 12:01:42 0 201
BMA
Student Journalists Training on AI-Driven Automation
By 2026, understanding and utilizing AI tools has shifted from being an optional skill to a...
By JoinBMA 2026-08-21 09:40:36 0 177
Andhra Pradesh
Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్‌లో సీఎంకు...
By Pagadala Venkateswar 2026-01-19 10:18:44 0 229
SURAKSHA
Psychiatric Support for Police Personnel
 To address the high levels of stress and burnout among police staff, a new initiative has...
By Kalaga Sailaja 2026-06-29 09:04:49 0 189
Andhra Pradesh
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం,...
By Rajini Kumari 2026-06-22 12:51:05 0 355
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com