Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు.

0
208

బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం 

కేంద్రానికి కొలిజియం సిఫార్సు

ఏపీ హైకోర్టులో 33 మందికి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీ నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం నిన్న సమావేశమై ఆయన పేరును ఆమోదించింది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. 

 

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 32 మంది న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నారు. కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, మెడమల్లి బాలాజీతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది.

 

మెడమల్లి బాలాజీ - నేపథ్యం 

 

కడప జిల్లా రాజంపేట మండలం శేషన్నగారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న బాలాజీ జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సుబ్బయ్యనాయుడు సహకార సెంట్రల్‌ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. బాలాజీ పాఠశాల విద్యను రాజంపేటలో పూర్తి చేయగా, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. 1998 ఏప్రిల్‌ 9న బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. 

 

రాజ్యాంగ సంబంధ అంశాలు, సివిల్‌, క్రిమినల్‌, సర్వీస్‌, కమర్షియల్‌ కేసుల వాదనలో ఆయనకు విశేష అనుభవం ఉంది. 2004 నుంచి 2006 వరకు అడ్వకేట్‌ జనరల్‌ కార్యాలయానికి అనుబంధంగా ఏజీపీగా సేవలు అందించారు. 2018-19 మధ్యకాలంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. అలాగే పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు, బ్యాంకులకు న్యాయ సలహాదారుగా కూడా సేవలందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం పల్లె కృష్ణ CTIU తాడేపల్లి మండలం కన్వీనర్
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.    పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-20 13:49:07 0 247
Andhra Pradesh
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి   23న విచారణకు రావాలని...
By Pagadala Venkateswar 2026-01-19 06:52:25 0 223
Telangana
కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:12:01 0 296
Telangana
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-30 13:36:13 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com