నేరాలు మాని మారకపోతే పీడీ యాక్ట్ తప్పదు: రౌడీషీటర్లకు హెచ్చరిక.|

0
241

హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) 

నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి IPS స్పష్టం చేశారు. అంబర్ పేట లోని డిసిపి కార్యాలయ ఆవరణలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని యాక్టివ్ మరియు ఇన్ యాక్టివ్ ఆ రౌడీషీటర్లకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించినా, సెటిల్మెంట్లు, భూతగాదాలు, లేదా ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉక్కు పాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. నేరపూరిత జీవితాన్ని వదిలిపెట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా మారి కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా జీవించాలని సూచించారు.

పోలీస్ నిఘాలో రౌడీ షీటర్లు :

పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కేవలం కేసులు మాత్రమే కాకుండా, అవసరమైతే పీడీ (PD) యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి తెలిపారు. రౌడీ షీటర్ల కదలికపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఏసీపీలు, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.  

#sidhumaroju 

Search
Categories
Read More
SURAKSHA
Inside the Journey of IAS Shri. Rajeev Topno
From Grassroots Governance to Global Policy Excellence: When true leadership meets unyielding...
By Kalaga Sailaja 2026-07-27 09:46:21 0 169
SURAKSHA
YVVJ Rajasekhar IAS: Driving Livestock Growth With Vision
A distinguished 2012-batch IAS officer of the AGMUT cadre, YVVJ Rajasekhar is strengthening...
By Lokeshwari Panthadi 2026-08-03 07:28:44 0 220
Andhra Pradesh
వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.
నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-05-12 06:08:40 0 130
Andhra Pradesh
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్...
By Kothuru Murali 2026-05-24 17:39:08 0 136
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి సందర్భంగా
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి సందర్భంగా...
By Chennaiah Kati 2026-01-22 13:07:01 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com