Payyavula Keshav: ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు!

0
205

Payyavula Keshav: ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు!

28-01-2026 Wed 08:05 | Andhra

AP Budget Sessions Dates Fixed Finance Minister to Present Budget

ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు

11న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 13న ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు

ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగనున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 

 

సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. అదే రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తీర్మానంపై ప్రసంగించనున్నారు.  

 

ఈసారి సమావేశాల్లో కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా పలు కీలక బిల్లులను కూడా ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా అన్ని శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు సమాచారం.

Search
Categories
Read More
Bihar
Bihar Teacher Transfer Rules 2026: A Reformist Approach
The Bihar government has approved the landmark Bihar State Teacher Transfer Rules 2026, marking a...
By Lokeshwari Panthadi 2026-06-26 12:53:29 0 160
Andhra Pradesh
ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా...
By Boya Dasthagiri 2026-04-03 07:26:24 0 322
Andhra Pradesh
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన ఎంపీడీవో
కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను...
By Boiena Rajesh 2026-08-26 11:20:50 0 117
Andhra Pradesh
వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు
వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు...
By Chennaiah Kati 2026-06-26 16:55:48 0 100
Andhra Pradesh
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*   *నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-13 16:12:47 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com