యోగా వలన శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు .

0
588

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం సిబ్బందికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న “మోబిలైజేషన్ (శిక్షణ) కార్యక్రమం” లో భాగంగా, ఈరోజుగుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి యోగా అభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో వివిధ యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు చేయించడమేకాక, యోగా వలన కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించారు. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం ఎంతో కీలకమైన పోలీస్ శాఖ వంటి సేవా రంగంలో పనిచేసే సిబ్బందికి యోగా అత్యంత అవసరమని అదనపు ఎస్పీ గారు తెలిపారు.

 👉 ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ...

🔅యోగా, ధ్యానం అనేవి మనిషి శారీరక, మానసిక స్థితిగతులను సానుకూలంగా మార్చగల శక్తిని కలిగి ఉంటాయని, నిరంతర యోగా అభ్యాసం వలన

* ఆలోచనా విధానం, నిర్ణయాత్మక సామర్థ్యం మెరుగుపడతాయని

* మానసిక స్థిరత్వం, ప్రశాంతత అలవడుతాయని

* ఒత్తిళ్లు, విధులలో వచ్చే మానసిక ఒడిదుడుకులను అధిగమించే శక్తి పెరుగుతుందని

* క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పెరిగి, దురలవాట్లకు దూరంగా ఉండేందుకు దోహదపడుతుందని తెలిపారు.

🔅 అదనంగా పోలీస్ విధుల్లో ఉండే అధిక ఒత్తిడి, రాత్రి విధులు, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడం వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అలాంటి పరిస్థితుల్లో యోగా, ధ్యానం పోలీస్ సిబ్బందికి ఒక మానసిక రక్షణ కవచంలా పనిచేస్తాయని తెలిపారు. యోగా అభ్యాసం వలన శ్వాస నియంత్రణ మెరుగుపడి, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

🔅 నిత్యం యోగా అభ్యాసం చేయడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, మానసిక ఆందోళనలు తగ్గి, విధి నిర్వహణలో సమర్థత పెరుగుతుందని అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారితో పాటు, ఏఆర్ డీఎస్పీ శ్రీ సంకురయ్య గారు, ఆర్‌ఐలు శ్రీ శ్రీహరి రెడ్డి, సురేష్, శివరామకృష్ణ, శ్రీనివాసరావు, రామకృష్ణ రెడ్డి గారు తదితర పోలీస్ అధికారులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని
*నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని*   ఫిరాయింపు ఎమ్మెల్యే...
By Ellandula Sandeep 2025-12-24 14:22:20 0 756
Andhra Pradesh
కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు పూజలు.. రాష్ట్రాభివృద్ధికి విఘ్నాలు తొలగాలని ప్రార్థన.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన...
By Pagadala Venkateswar 2026-09-14 10:41:59 0 69
Andhra Pradesh
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...
By Rajini Kumari 2026-01-09 10:19:46 0 209
Andhra Pradesh
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా...
By Benguluri Madhubabu 2026-06-14 03:54:02 0 173
Andhra Pradesh
పైడితల్లమ్మ జాతర తేదీలు ఖరారు
విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు....
By Boiena Rajesh 2026-08-24 10:16:40 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com