Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.

0
202

కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన మేజర్ నాయుడు

కశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి, సహచరులను కాపాడినందుకు ఈ పురస్కారం

2024 స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆయనకు కీర్తిచక్ర ప్రకటించిన కేంద్రం

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్‌గోపాల్‌నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం.

 

2023 అక్టోబర్‌ 26న జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మేజర్ రామ్‌గోపాల్ నాయుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి, తన సహచర సైనికుల ప్రాణాలను కాపాడారు. ఆయన వీరత్వానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.

 

కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో రామ్‌గోపాల్ నాయుడు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. స్థానిక ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపగా, మేజర్ రామ్‌గోపాల్ ఏమాత్రం వెనకాడకుండా ఎదురుదాడికి దిగారు. అత్యంత సమీపం నుంచి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది గ్రెనేడ్ విసరగా, చాకచక్యంగా తప్పించుకుని అతడిని కూడా హతమార్చారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

 

సాయుధ బలగాల్లో 'చక్ర' అవార్డులు పొందిన వారికి నగదు బహుమతులు అందించాలన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఏపీ సర్కార్ ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్‌గా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.# పి వెంకటేష్

Search
Categories
Read More
Telangana
మాకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి
విద్య కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ.... అనే వాక్యాన్ని తీవ్రంగా...
By Bheeshman King 2026-02-27 11:29:03 0 552
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 217
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో స్థానికులు భయాందోళన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆంధ్రా స్పైస్ రెస్టారెంట్‌లో ఆదివారం...
By Pagadala Venkateswar 2026-08-09 14:32:13 0 123
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 321
Andhra Pradesh
విజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక
తమిళస్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:52:48 0 416
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com