Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.

0
220

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు హర్షం

ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్

మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ సహా పలువురికి పద్మశ్రీ

ఈ పురస్కారాలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్ష

2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు శుభాకాంక్షలు చెబుతూ, ముఖ్యంగా 13 మంది తెలుగు వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కడం పట్ల ఆయన ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.

 

ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ పురస్కారం లభించడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా, పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారందరికీ ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలలో యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ ఉన్నారు.

 

ఇంకా సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, గడ్డమనుగు చంద్రమౌళి... వైద్య రంగంలో పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకట్రావు... సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రి... నృత్యంలో దీపికారెడ్డిలకు అభినందనలు తెలిపారు. మరణానంతరం పద్మశ్రీ పొందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), రామారెడ్డి మామిడి (పశుసంవర్ధక)ల సేవలను కూడా సీఎం స్మరించుకున్నారు.

 

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించి తెలుగు జాతి ఖ్యాతిని మరింతగా వెలిగించిన ఈ ప్రముఖుల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
వేగంగా ఎస్‌ఐఆర్
ప్రతీ ఒక్కరూ SIR లో వివరాలు నమోదు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ...
By Bheeshman King 2026-06-30 13:55:23 0 148
Andhra Pradesh
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....
By Kothuru Murali 2026-02-11 08:48:19 0 193
Telangana
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:06:30 0 251
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 254
BMA
Demolishing Fake News: The Power of Verified Truth
In an era dominated by political IT cells and algorithmic misinformation, the absolute strength...
By JoinBMA 2026-08-21 10:25:05 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com