అల్వాల్ పోలీసుల మెరుపు వేగం- అరగంటలోనే చిన్నారి ఆచూకీలభ్యం .|

0
232

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : క్షణాల్లో కళ్ళ ముందు నుండి కనబడకపోయినా తమ బాలుడు తిరిగి క్షేమంగా చేరడంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో నివాసముంటున్న  రమేష్ కుమారుడు ఏడేళ్ల సంజయ్ అదృశ్యమయ్యాడు. 

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

పోలీసుల తక్షణ స్పందన : స్థానికుడి సహకారం.

ఫిర్యాదు అందిన వెంటనే అల్వాల్ పోలీసులు చురుగ్గా స్పందించారు. అదృశ్యమైన 30 నిమిషాల్లోనే బాలుని గుర్తించేందుకు తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో స్థానిక నివాసి మక్కల సర్వేష్ అందించిన కీలక సమాచారంతో  సంజయ్ ను పోలీస్ లు విజయవంతంగా గుర్తించారు.

బాలుడిని తల్లిదండ్రులకు  అప్పగించినప్పుడు,  ఇంతసేపు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన వారు.. ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. తమ బిడ్డను ఇంత తొందరగా క్షేమంగా అప్పగించిన పోలీసులకు, తల్లిదండ్రులు  కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు చూపిన చొరవను అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ అభినందించారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన
జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని...
By Ponnala Srinivasrao 2026-08-07 01:51:58 0 134
Telangana
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్: _🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_ "దుర్గాష్టమి"...
By Sidhu Maroju 2025-09-30 10:55:36 0 320
Telangana
జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత...
By Bheeshman King 2025-12-14 13:42:01 0 408
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : చెన్నపట్నం చెరువులను పరిశీలించిన అధికారులు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువును శుక్రవారం ఈ.ఈ....
By Kothuru Murali 2026-02-14 07:44:06 0 193
Telangana
౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు
కెసిఆర్ గారు కట్టిన ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, అయినా మాటలు తక్కువ పని చాల ఎక్కువ, కేవలం...
By Ponnala Srinivasrao 2026-04-25 01:06:43 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com