Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు... నో పే!: అయ్యన్నపాత్రుడు.

0
194

స్పీకర్ల మహాసభలో అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

'నో వర్క్.. నో పే' విధానం అమలు చేయాలన్న అయ్యన్న

సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని వ్యాఖ్య

వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్నపాత్రుడు కీలక ప్రసంగం చేశారు.

 

 

 

ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ గుర్తు చేశారు. ప్రజలు నమ్మకంతో ఎన్నుకుని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదని స్పష్టంగా చెప్పారు. శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అయ్యన్నపాత్రుడు కోరారు. శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చాలంటే ఇలాంటి సంస్కరణలు తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడ్డారు.

 

 

ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా ‘నో వర్క్.. నో పే’ విధానం అమలైతే, శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి...
By Pagadala Venkateswar 2026-03-08 06:49:23 0 168
Telangana
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...
By Sidhu Maroju 2026-01-15 14:28:14 0 271
BMA
Gamifying Accountability: The 2026 Manifesto Tracker
Moving beyond static charts, digital newsrooms in 2026 are launching interactive "Manifesto...
By JoinBMA 2026-08-22 04:01:37 0 384
Andhra Pradesh
ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన...
By Pagadala Venkateswar 2026-05-13 06:20:09 0 130
Andhra Pradesh
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-06 13:21:00 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com