పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం

0
227

*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*

 

*పోలవరం, జనవరి 20:* 

 

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 2 ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు .అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
By Sidhu Maroju 2026-03-31 10:14:11 0 229
Andhra Pradesh
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ...
By Benguluri Madhubabu 2026-03-08 13:31:10 0 385
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 309
Telangana
తన గురువు డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల కేసీఆర్ సంతాపం.
తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి...
By Ponnala Srinivasrao 2026-03-28 01:52:43 0 238
SURAKSHA
Shri Ankit Yadav, IAS: A Visionary Leader in Public Service
A dynamic IAS officer known for administrative excellence, transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-20 13:53:44 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com