పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!

0
172

కర్నూలు : నంద్యాల : డోన్: 

ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులు మరియు పశుపాలకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు 19-01-2026 నుండి 30-01-2026 వరకు నిర్వహించబడతాయని, పశుపాలకులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు.

ఈ శిబిరాల ద్వారా పశువులకు ఉచిత వైద్య చికిత్సలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, అలాగే వివిధ నివారణ మందుల పంపిణీ నిర్వహించబడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలోని పశుసంపద ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


Search
Categories
Read More
Andhra Pradesh
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
By Pagadala Venkateswar 2026-04-05 05:34:30 0 166
Telangana
ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా 'నరుకుతం’. రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ...
By Ponnala Srinivasrao 2026-04-15 04:02:07 0 152
Andhra Pradesh
ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు కారణం మీదే.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష పదివేల జరిమానా...
By John Baji 2025-12-31 01:27:27 0 181
Andhra Pradesh
దేవాలయాలు నాగరికతకు అభివృద్ధికి భక్తి పారవశానికి సోపానాలు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం నాయిని...
By Benguluri Madhubabu 2026-03-08 12:56:55 0 187
Andhra Pradesh
మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్,...
By Pagadala Venkateswar 2026-04-13 05:43:50 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com