పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్:
ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులు మరియు పశుపాలకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు 19-01-2026 నుండి 30-01-2026 వరకు నిర్వహించబడతాయని, పశుపాలకులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు.
ఈ శిబిరాల ద్వారా పశువులకు ఉచిత వైద్య చికిత్సలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, అలాగే వివిధ నివారణ మందుల పంపిణీ నిర్వహించబడుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలోని పశుసంపద ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz