Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు.

0
236

ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ

వైసీపీ హయాంలో మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లు అభియోగాలు

సిట్‌ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేసిన ఈడీ

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

 

ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.

 

మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ విచారణను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. 

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Expands Women Welfare and Empowerment
Andhra Pradesh continues to strengthen women empowerment and social welfare through initiatives...
By Fathima Safa 2026-06-27 11:24:12 0 263
Bihar
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...
By Dunna Jessicaruth 2026-05-16 05:27:31 0 124
Andhra Pradesh
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
By Jeeru Kumar 2026-02-25 08:56:11 0 989
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
By Pagadala Venkateswar 2026-03-15 03:55:25 0 190
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమలలో పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు మెంబర్
సోమల మండలానికి సమీపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల ఆలయంలో శుక్రవారం మొలకల పౌర్ణమి...
By Kothuru Murali 2026-05-01 12:27:14 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com