రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
Posted 2026-01-15 14:28:14
0
272
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సంక్రాంతి సంబరాలను, తన సతీమణి శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, తన మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య తో కలిసి ఘనంగా జరుపుకున్నారు.
ఫామ్ హౌస్ ప్రాంగణాన్ని గొబ్బెమ్మలు, నవధాన్యాలు మరియు చెరుకు గడలతో సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. రంగవల్లులతో నిండిన ఫామ్ హౌస్ పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది.
గత పండుగలకు విరుద్ధంగా ఎర్రవల్లి వేడుకలకు కెసిఆర్ కూతురు కవిత దూరంగా ఉన్నట్టు తెలిసింది.
ఈ సందర్భంగా కెసిఆర్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
తన పదేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ పురోగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారి, రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మే 2 నుంచి మొక్కజొన్న కొనుగోలు తాత్యలిక నిలిపివేత...
నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దుయార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం...
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే...
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
పుంగనూరు: గంగ జాతరను విజయవంతం చేద్దాం
ఈనెల 10, 11 తేదీల్లో పుంగనూరులో జరగనున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి...