సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం

0
231

జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహా జాతర తొలి ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే *మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజలు* నిర్వహించారు. అలాగే *కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు ప్రత్యేక పూజలు* చేశారు. వనదేవతల ఆలయాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. గుడి శుద్ధి అనంతరం ఆడపడుచులు అడవి నుంచి సేకరించిన పవిత్రమైన పుట్టమన్నుతో ఆలయ ప్రాంగణాలను పూజారులు అలికారు. రంగురంగుల ముగ్గులతో అలం కరించారు. ఆదివాసీల ఆచారాల ప్రకారం.. ఈ 'గుడిమెలిగే' కార్యక్రమం పూర్తయినప్పటి నుంచే మేడారం ప్రాంతంలో పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో జాతర పనులు వేగవంతం అవుతాయి. 15 రోజుల తర్వాత జరిగే మహాజాతర కోసం ఇప్పటికే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేభక్తుల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Search
Categories
Read More
SURAKSHA
Shobhit D. Saksena, IPS: A Guardian of Law and Duty
An accomplished IPS officer of the AGMUT cadre, Shobhit D. Saksena has built a reputation for...
By Lokeshwari Panthadi 2026-07-22 04:37:51 0 117
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం కందూరులో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల...
By Kothuru Murali 2026-03-27 14:36:21 0 196
Telangana
ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి...
By MERIGE MALLESH 2026-04-01 10:41:05 0 2K
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత సమైన్యంగా...
By Alige Srinivas 2026-03-06 13:21:43 0 743
Andhra Pradesh
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ SC Cell కార్య దర్శి ( దావులూరి వెంకటేష్ )
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. ...
By VALLERU SIMHADRI 2026-09-10 16:22:48 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com