గంపలగూడెం రహదారులకు మహర్దశ

0
243

*ప్ర‌చుర‌ణార్థం* *14-01-2026*

 

*గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*

 

*పల్లెలలో రహదారుల అభివృద్ధికి కూట‌మి ప్రాధాన్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్* 

 

*గంప‌ల‌గూడెంలో సీసీ రోడ్ల నిర్మాణ ప‌నుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శంకుస్థాప‌న* 

 

 

గంప‌ల‌గూడెం మండ‌లం : పల్లెపండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం, గంప‌ల గూడెం మండ‌లం గంప‌ల గూడెం పంచాయ‌తీలో రామ్మోహ‌న్ ధియేట‌ర్ ఎదురుగా వున్న ఎస్సీ, బిసీ కాలనీల‌కు మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ ప‌థ‌కం కింద రూ.41 ల‌క్ష‌ల అంచ‌నా విలువ‌తో నిర్మించనున్న అంత‌ర్గ‌త సిమెంట్ రోడ్ల ప‌నుల‌కు బుధ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ శంకుస్థాప‌న చేశారు.

 

గంప‌ల‌గూడెంలో రోడ్ల శంకుస్థాప‌నకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్య‌క్షుడు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు, గంప‌ల‌గూడెం మండ‌లం తెలుగుదేశంపార్టీ అధ్య‌క్షుడు మానికొండ రామ‌కృష్ణ (ఎమ్.ఆర్.కె) స్థానిక ఎన్డీయే కూటమి నాయ‌కుల‌తో క‌లిసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

 

అనంత‌రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, మరోవైపు పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 

 

 ఈ కార్యక్రమంలో ఎయంసీ చైర్ పర్సన్ రేగళ్ళ లక్ష్మి అనిత వీరారెడ్డి, సర్పంచ్ కోట పుల్లమ్మ , స్థానిక ఎన్డీయే కూట‌మి నాయ‌కులు కాజా రవికుమార్ , సత్యంబాబు, కావూరి బాబు, గువ్వల వెంకటేశ్వర రెడ్డి, యసారపు ముత్యాలరావు, కోట వెంకటేశ్వరరావు, వేముల బాలయ్య, నల్లగట్ల రాఘవమ్మ, ఎంపీడీవో సరస్వతి ల‌తో పాటు కూటమి నేతలు, పంచాయతీ రాజ్ డిఈ, ఎఈ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-15 11:37:55 0 240
SURAKSHA
Guardian of Law: The Inspiring Journey of IPS Shri Narsimha N. Komar
From Engineering Roots to Excellence in Policing: How a Tech-Savvy Officer is Redefining Modern...
By Kalaga Sailaja 2026-07-27 05:11:12 0 233
Andhra Pradesh
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి...
By Boya Dasthagiri 2026-05-21 08:26:20 0 265
Andhra Pradesh
పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా...
By Kothuru Murali 2026-04-15 07:19:15 0 162
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది మౌర్యా రెడ్డి
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు...
By Benguluri Madhubabu 2026-02-22 06:40:38 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com