నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్

0
213

*Press Release*

 

*నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్*

 

నారావారిపల్లె: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబునాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు సీఎం నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తేజస్విని, ఎంపీ శ్రీ భరత్, నారా రోహిత్, నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.

*****

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...
By John Baji 2026-02-04 15:02:53 0 588
Andhra Pradesh
రేపటి వరకే ఛాన్స్. SIR
ఏపీ ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు తమ ఇనుమరేషన్ పూర్తి చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది రేపటి లోగా...
By Benguluri Madhubabu 2026-07-13 01:18:34 0 222
Andhra Pradesh
మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా...
By Pagadala Venkateswar 2026-02-14 06:41:12 0 218
Telangana
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఆవిష్కరణ
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ...
By Midathapalli Kiran Kumar 2026-04-26 01:25:30 0 364
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com