స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము

0
206

*స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యలు కావాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఎన్జీవోస్ అసోసియేషన్...2026క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము*

 

*విజన్ ఉన్న నాయకుడు సీఎం అయితే... రాష్ట్రానికి, ప్రజలకు ఎంత మంచి చేయచ్చో చంద్రబాబు చూపిస్తున్నారు*

 

*గుడివాడ అభివృద్ధికి....అందరం కలిసి ముందుకు సాగుదాం*

 

గుడివాడ జనవరి 12:సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌ దిశగా సాగుతున్న రాష్ట్రానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు అండగా నిలవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ అభివృద్ధి కోసం అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామన్నారు.

 

 ఎన్జీవో అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం ఉదయం ఆవిష్కరించారు. 

 

ఈ సందర్భంగా ఎన్జీవో నేతలతో కొద్దిసేపు ఎమ్మెల్యే రాము మాట్లాడారు.... గుడివాడలో అభివృద్ధి పనుల పై ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యేతో ఉద్యోగులు అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని, ఐక్యంగా ముందుకు సాగుతూ

 

 ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మంచి కోసం ఉద్యోగ వర్గాలు చేసే అన్ని కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందనీ ఉద్యోగులతో ఎమ్మెల్యే రాము అన్నారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ...పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఐదేళ్ల వైసీపీ పాలనకు స్వస్తి చెప్పి కూటమి పార్టీలకు పట్టం కట్టడంతో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రుణపడి ఉంటుందన్నారు.

 

 అయితే ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు జరిగిన పొరపాటు సరిదిద్దు కున్నారన్నారు. పరిపాలన అనుభవం, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే... రాష్ట్రానికి ప్రజలకు ఎంత మంచి చేయచ్చో చంద్రబాబు 19 నెలల కాలంలో ప్రత్యక్షంగా చూపించారన్నారు. కూటమిలో భాగస్వామైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సహకారం, దేశప్రధాని నరేంద్రమోడి తోడ్పాటుతో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘటించారు.

 

ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ అసోసియేషన్ గుడివాడ అధ్యక్షులు కేపీ రావు, ప్రధాన కార్యదర్శి జి. రాజేంద్రప్రసాద్, అసోసియేషన్ నాయకులు పి వి ఆర్ వి ప్రసాద్, బివై విష్ణు ప్రసాద్, ఎం విద్యావతి, కే మహేష్, ఎంవి శ్రీనివాస్, డి జ్వాలా కిరణ్, డి విక్టర్ బాబు, పాపయ్య, వెంకటాద్రి,మనోజ్,రాము,రమేష్ బాబు, కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, పలువురు ఎన్జీవో నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-17 10:44:44 0 216
Telangana
ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి...
By Chunarkar Jagadeesh 2026-07-20 14:42:43 0 257
Telangana
డబ్బా కోట్లను తొలగించవద్దు.
చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-05-09 09:39:22 0 188
BMA
DMI 2026 Summit Ends in New Delhi; Newsroom Tours Conclude
The WAN-IFRA Digital Media India (DMI) 2026 conference in New Delhi has concluded, marking a...
By JoinBMA 2026-08-19 05:09:21 0 267
Telangana
జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ షాప్ ల యజమానులకు పోలీసుల హెచ్చరిక.|
హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాల్,...
By Sidhu Maroju 2025-11-27 10:41:20 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com