ఉచిత క్యాన్సర్స్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే !!

0
192

కర్నూలు: నంద్యాల : డోన్

ఈ రోజు డోన్ పట్టణంలోని క్లబ్ హౌస్ ప్రాంగణంలో డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ గారి సహకారంతో,బసవతారక్ ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ (స్క్రీనింగ్) శిబిరం ప్రారంభోత్సవ  కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణలో బసవతారక్ ఇండో–అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
10వ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభకు కలెక్టర్ అభినందనలు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన...
By Pagadala Venkateswar 2026-05-04 09:39:11 0 98
Telangana
గ్రామ సభ – నర్సయ్యపల్లి, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా
GAREPALLY 
By Sunka Santhosh 2026-04-02 06:13:54 0 228
Andhra Pradesh
MP కేశినేని శివనాద్ కార్యాలయంలో మెప్మా SHG మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
*విజ‌య‌వాడ* *22-12-2025*   *ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*...
By Rajini Kumari 2025-12-22 07:22:04 0 180
Andhra Pradesh
ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను...
By Boiena Rajesh 2026-03-09 14:26:34 0 198
Telangana
"చీరల సందడి మొదలు"|
"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం." మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-25 08:45:35 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com