250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్

0
228

కర్నూలు : కర్నూలు సిటీ : 

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు
• 15 జెసిబిలతో 2వ విడత స్పెషల్ డ్రైవ్

నగరపాలక సంస్థ;
11-01-2026
ఆదివారం

నగర పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. 7, 12, 14 శానిటేషన్ డివిజన్ల పరిధిలోని 127 ఖాళీ స్థలాలతో పాటు నగర వ్యాప్తంగా 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కల తొలగింపునకు 15 జెసిబిలతో ఆదివారం 2వ విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బళ్ళారి చౌరస్తా వద్ద కమిషనర్ జెండా ఊపి ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. 

అనంతరం షరీన్‌నగర్, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత పనులను స్వయంగా పరిశీలించారు.
వెంకటరమణ కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో విస్తారంగా పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు వియల్‌టి చెల్లించకపోవడం, మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రపరచి నగరపాలక సంస్థ అవసరాలకు వినియోగించుకోవాలని శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థలానికి పక్కనే ఉన్న ఓ ఆసుపత్రి నిర్వాహకులు ఆ స్థలంలో సి అండ్ డి వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు వేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై ట్రేడ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పేరుకుపోతున్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. దోమలు, పాములు, విషకీటకాలు విపరీతంగా పెరిగి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఖాళీ స్థలాల శుభ్రత అత్యంత అవసరమని స్పష్టం చేశారు. అందుకే పిచ్చి మొక్కల తొలగింపునకు 2వ విడత స్పెషల్ డ్రైవ్‌ను క్రమబద్ధంగా చేపట్టామని తెలిపారు.

2వ విడతలో తొలుత మూడు శానిటేషన్ డివిజన్ల పరిధిలో వంద శాతం ఖాళీ స్థలాల శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, అనంతరం నగర వ్యాప్తంగా మొత్తం 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, స్వచ్ఛత పనులు చేపట్టామని వివరించారు. ఖాళీ స్థలాల యజమానులు తప్పనిసరిగా తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు, జరిమానాలు, అవసరమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం నగరపాలక సంస్థ బాధ్యతతో పాటు ప్రజల సామూహిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రజల సహకారంతోనే ఆరోగ్యకరమైన నగరంగా కర్నూలును తీర్చిదిద్దగలమని కమిషనర్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
యువ కరాటే క్రీడాకారుడు అభిలాష్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-04-09 13:48:28 0 148
Andhra Pradesh
పుంగనూరు: మడుగు తెరువు లాగిన పెద్దిరెడ్డి
పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-29 07:36:43 0 170
Andhra Pradesh
పుంగనూరులో ఆ పనులు పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష: బీజేపీ
పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది....
By Kothuru Murali 2026-04-29 11:33:33 0 90
SURAKSHA
Smart Policing: Modernizing the Assam Police Force
The Assam Police force is undergoing a major structural and technological revolution, driving a...
By Lokeshwari Panthadi 2026-07-04 09:20:32 0 129
Andhra Pradesh
బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు
విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు...
By Mobbu Venkatramana 2026-03-04 08:58:02 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com