రేపు ఆదివారం రోజు ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం : కమిషనర్

0
222

కర్నూలు : కర్నూలు సిటీ : 

రేపు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• 15 జెసిబిలతో 2వ విడత స్వచ్ఛత పనులు
• 3 డివిజన్లలో 100% ఖాళీ స్థలాల శుభ్రతకు ప్రణాళిక

నగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపును మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆదివారం రెండో విడతగా విస్తృత స్వచ్ఛత పనులు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య తనిఖీదారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ప్రత్యేక డ్రైవ్‌ను 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7, 12, 14వ శానిటేషన్ డివిజన్ల పరిధిలోని మొత్తం 127 ఖాళీ స్థలాల్లో 15 జెసిబిల సహాయంతో  వంద శాతం పిచ్చి మొక్కలను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. మూడు శానిటేషన్ డివిజన్ల పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటినీ శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, అనంతరం ఇతర డివిజన్ల పరిధిలోని పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, కార్యదర్శి నాగరాజు, శానిటేషన్ సూపర్వైజర్ ఎం.శ్రీనివాసరావు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
"పీడీఎఫ్" లబ్ధిదారులకు చింతూరు ఐటీడీఏ పీఓ అలర్ట్.
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక...
By Shyamala Yadagiri 2026-04-27 01:13:22 0 206
Andhra Pradesh
ఇంటర్ పరీక్షలు పై పోలీస్ డేగకను: ఎస్పీ
అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట...
By Pagadala Venkateswar 2026-02-25 08:50:42 0 159
Telangana
4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-01 13:54:23 0 716
Andhra Pradesh
మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన...
By Pagadala Venkateswar 2026-04-06 04:22:54 0 184
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై...
By Kothuru Murali 2026-01-31 16:09:08 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com