కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

0
221

కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం

–3వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

+++++

 

         కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్థి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.  

 

   శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్‌ సీతారామ నగర్‌ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెల్సుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు.  

 

 

   ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో చతికిల పడిన రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్థి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తనకున్న రాజకీయ అనుభవం, సమర్థత, పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్థి చేస్తూ ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ఒక వైపు రాష్ట్రాన్ని అభివృద్థి చేస్తూనే సూపర్‌ సిక్స్‌ పేరుతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తోడుగా విద్యుత్‌ ఛార్జీలు తగ్గింపు, జీఎస్టీలో సంస్కరణ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి పేదలపై ఆర్థిక భారాలను తగ్గించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

    ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడి బాబూరావు, గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్, బండి సాయి కోమలి, గుంజు ఏసు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 194
Andhra Pradesh
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
By Pagadala Venkateswar 2026-01-04 07:11:29 0 280
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 245
Andhra Pradesh
తక్షణమే కోసిగి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎత్తివేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి
కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి...
By Boya Dasthagiri 2026-07-28 14:07:43 0 139
Andhra Pradesh
పవర్ కట్.. తాగునీటి సరఫరాకు అంతరాయం
వంగరలో తాగునీటి సరఫరా ఆదివారం నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు బోరు మోటర్లు వద్ద నీటిని...
By Boiena Rajesh 2026-08-30 05:38:56 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com