సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?

0
232

*సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?*

 

 

 *పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!*

 

 

సంక్రాంతి పండుగ హడావు డి మొదలైంది ప్రధానంగా నగరాల నుంచి పల్లెలకు వెళ్లే జనం శుక్రవారం సాయంత్రం నుంచే క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్ నగరం బిజీబిజీగా కనిపిస్తుంది శుక్రవారం రాత్రి నుంచి సొంతూరుకు పయనమవుతున్నారు. నగరవాసులు ప్రధానంగా ఏపీ, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే ప్రయాణికు లతో అటు రైల్వే స్టేషన్ల, ఇటు బస్టాండ్లు రద్దీగా మారాయి...

 

సంక్రాంతి పండగ పూట సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులతో పాటు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది, సంక్రాంతి పండుగ సంద ర్భంగా ప్రత్యేక బస్సులు నడపాల్సిన ఆర్‌టీసీ అధికారులు బస్సులు సమయానికి నడపక పోవడంతో శనివారం తెలంగాణ జిల్లాల్లోని కొన్ని బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. 

 

వచ్చిపోయే బస్సుల కోసం ప్రయాణికులు పరుగులు తీయడం, సీట్ల కోసం కుస్తీలు పడడం వంటి దృశ్యాలు కనిపించాయి. కాలేజీలకు, హాస్టళ్లకు, స్కూళ్లకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఆయా రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించడం వల్ల ప్రయాణీ కులు తిప్పలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 

 

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్, ములుగు, మహబూబాద్, నిజామాబా ద్, అదిలాబాద్, వంటి రూట్లలో ప్రత్యేక బస్సులను నడిపేవారు. కానీ ఇప్పుడు అవి కానరావడం లేదు. మరోవైపు ఆర్డినరీ బస్సుల కు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు వేసి ప్రయాణికుల వద్ద నుంచి అత్యధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. పల్లె వెలుగుతోపాటు ఆర్డినరీ బస్సులకు భూపాలపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల వంటి రూట్లలో ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డు లు ఏర్పాటు చేయడం, ఆ బస్సులు కూడా సమయా నికి గమ్య స్థానాలకు చేరడం లేదు. 

 

దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు సరిపడా రైళ్లు, ప్రత్యేక బస్సులు లేక ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలను ఆశ్రయించవలసివస్తుంది, సొంతూళ్ళకు ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లా నర్సంపేట్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి....
వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట...
By Gujile Ramu 2026-07-09 01:56:09 0 207
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026 విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
By Rajini Kumari 2026-03-06 10:56:24 0 183
Telangana
హిమాయతానగర్ గ్రామ చౌరస్తా లో ఆక్సిడెంట్
ఈరోజు హిమాయత్ నగర్ చౌరస్తా వద్ద ఓ ద్విచక్ర వాహనదారున్ని గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్ర...
By Veeresh Kumar 2026-03-23 13:07:28 0 266
Telangana
కట్టు కాలువ సర్వేపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారం దాదాపు వందల ఎకరాలను వరద ముప్పు నుండి కాపాడే కట్టు కాలువ...
By Sriramula Anil 2026-07-20 14:37:14 0 238
Goa
Infrastructure & Weather
A major explosion at the Amona 220kV substation early Friday plunged several areas of Sanquelim...
By Dunna Jessicaruth 2026-05-16 05:54:06 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com