బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు

0
531

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు

 

బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యలంక బీచ్ ని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న పనులపై ఆయన ఆరా తీశారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిర్మాణాలకు కేటాయించిన స్థలమును మ్యాప్ ద్వారా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు వేగంగా ఒకదాని వెంట ఒకటి జరగాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సూర్యలంక బీచ్ లో చేపట్టిన పనులన్నీ సెప్టెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని, పనుల పురోగతికి సంబంధించి వారం వారం నివేదికను అందజేయాలని ఆయన పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల తహసిల్దార్ సలీమా, బాపట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, మండల ఎంపీడీవో, సర్వేయర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన...
By Sidhu Maroju 2025-12-02 15:20:44 0 307
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
By Kothuru Murali 2026-04-22 14:45:55 0 138
BMA
Expendable Voices: The Crisis of Rural News Stringers
The backbone of national news relies entirely on mofussil "stringers"—freelance village and...
By JoinBMA 2026-08-21 09:51:31 0 81
Andhra Pradesh
ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*   విజయవాడ పశ్చిమ ఫిబ్రవరి 21 :...
By Rajini Kumari 2026-02-21 17:11:58 0 187
Rajasthan
Rajasthan Strengthens Environment and Wildlife Protection
Rajasthan continues to advance environmental conservation and wildlife protection through habitat...
By Fathima Safa 2026-07-03 04:30:04 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com