రహదారులపై జంతువులను వదిలితే కఠిన చర్యలు: కమిషనర్

0
243

కర్నూలు : కర్నూలు సిటీ : 

రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• 30 మంది జంతు యజమానులకు జరిమానా
• డాగ్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభం 

నగరంలో రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వదిలి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. శుక్రవారం ముజఫర్‌నగర్ ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న పశువులను గుర్తించి, సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి తరలించారు. జంతువులను బహిరంగంగా వదిలిన యజమానులపై ఒక్కో జంతువుకు రూ.500 చొప్పున జరిమానా విధించి, ఇకపై జంతువులను రహదారులపై వదలబోమని లిఖితపూర్వక హామీ తీసుకోవాలని శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌కు కమిషనర్ ఆదేశించారు.

అదేవిధంగా నగరంలోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాలు వంటి జనసమ్మర్ద ప్రాంతాల్లో ప్రజలకు ప్రమాదంగా మారుతున్న వీధి కుక్కలను నియంత్రించేందుకు గార్గేయపురం డంప్‌యార్డులో పనులు ప్రారంభించిన డాగ్ షెల్టర్‌ను కమిషనర్ పరిశీలించారు. అక్కడే కొనసాగుతున్న బయో మైనింగ్ ప్రక్రియను పరిశీలించి, ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బయో మైనింగ్ ద్వారా వేరు చేసిన వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు తక్షణమే తరలించాలని, 15 ఎకరాల విస్తీర్ణంలో బయో మైనింగ్ ద్వారా ఖాళీ అయ్యే స్థలాన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించాల్సి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులపై జంతువులను వదలడం నిషేధించామని తెలిపారు. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ ముజఫర్‌నగర్ ప్రాంతంలో జంతువులను బహిరంగంగా వదిలిన 30 మంది యజమానులకు రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జరిమానాతో పాటు ఇకపై జంతువులను వదిలితే గోశాలలకు తరలింపునకు అంగీకరిస్తూ యజమానుల నుంచి లిఖితపూర్వక హామీ పత్రాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గార్గేయపురం డంప్‌యార్డులో డాగ్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి జనసమ్మర్ద ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకర వీధి కుక్కలను అక్కడికి తరలిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ చర్యలను వేగవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్, డీఈఈలు గిరిరాజ్, పవన్‌కుమార్ రెడ్డి, ఏఈ జనార్ధన్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో శ్రీ శక్తి ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహణ.
మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు....
By Pagadala Venkateswar 2026-04-13 12:25:41 0 161
Tamilnadu
Tamil Nadu Government Signs ₹18,600 Crore Investment Pact With L&T
The Tamil Nadu government has solidified a major investment partnership by signing a significant...
By Tejaswini Komanduru 2026-06-05 11:16:19 0 373
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 171
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:టమోటా లోడ్ ట్రక్ బోల్తా
సోమల చౌడేపల్లి మార్గంలో టమోటా లోడ్ తో వెళ్తున్న ట్రక్ శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
By Kothuru Murali 2026-03-20 06:34:17 0 149
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 889
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com