ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం

0
344

ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం

బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ఉన్న అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇవాళ సంబంధిత ఆర్టీసీ అధికారులకు నోటీసులు అందజేయనున్నట్లు అద్దె బస్సుల యాజమాన్యం వెల్లడించింది.
శ్రీశక్తి పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగి తమపై అధిక భారం పడుతోందని యజమానులు చెబుతున్నారు. పెరిగిన రద్దీ కారణంగా ఇంధన వినియోగం అధికమై, నిర్వహణ మరియు మరమ్మత్తుల ఖర్చులు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అదనంగా ఒక్కో అద్దె బస్సుకు రూ.5,200 చెల్లించాలని జనవరి 7న ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులకు ఇది సరిపోదని, కనీసం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు చెల్లించాలని అద్దె బస్సుల యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. పలుమార్లు విన్నపించినప్పటికీ అధికారులు కేవలం రూ.5,200 మాత్రమే పెంచుతామని చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా అద్దె బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ సేవల్లో నడుస్తున్నాయి. ఇవి సమ్మె కారణంగా నిలిచిపోతే, సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని యాజమాన్యం హెచ్చరిస్తోంది.
సగటున బస్సుకు ఇంధన వినియోగం మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు పెరిగిందని, దానికి అనుగుణంగా మరమ్మత్తులు చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. అన్ని ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో తాము కోరిన విధంగా చెల్లింపులు చేస్తేనే బస్సులను సజావుగా నడపగలమని స్పష్టం చేశారు.
తమ సమస్యపై అధికారులు స్పందించి న్యాయం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని, అవసరమైతే ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామని అద్దె బస్సుల యాజమాన్యం ప్రకటించిది

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పసుగణ రంగానికి పునర్ వైభవం
*Press Release*     *పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుగణ రంగానికి పునర్వైభవం*  ...
By Rajini Kumari 2026-01-19 11:18:11 0 202
Telangana
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 11:48:04 0 133
Gujarat
Agri-Alert: Protecting Kharif Crops from Monsoon Risks
The Department of Agriculture has issued a critical advisory for farmers to safeguard their...
By Lokeshwari Panthadi 2026-07-01 06:31:20 0 174
SURAKSHA
Manoj Abraham IPS: Driving Innovation and Excellence in Kerala Policing
"A police force becomes stronger when it combines discipline with innovation and public trust."...
By Fathima Safa 2026-07-08 08:00:51 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com