భవన నిర్మాణాల వ్యర్ధాల నిర్వహణ మరింత సమర్థంగా చేపట్టాలి :: కమిషనర్

0
182

కర్నూలు : కర్నూలు సిటీ : 

భవన నిర్మాణాల వ్యర్థాల నిర్వహణ పటిష్టం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

నగరంలో సి & డి (కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్) వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ తన క్యాంపు కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సి & డి వేస్ట్ మేనేజ్మెంట్‌ విధానంపై సమావేశం నిర్వహించారు. నగర సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణకు సి & డి వ్యర్థాల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. నిర్మాణ, కూల్చివేత పనుల నుంచి వచ్చే సి & డి వ్యర్థాలను ప్రజలు ఎక్కడబడితే అక్కడ పడేయకుండా యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. సి & డి వ్యర్థాల సేకరణ, తరలింపుకు ట్రాక్టర్‌కి రూ‌.500 చొప్పున ప్రకారం నామమాత్రపు రవాణా చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు, అధికారికంగా నియమిత వ్యవస్థ ద్వారానే తరలించాలని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు సి & డి వ్యర్థాలను తరలించడం అనుమతించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
TN Administrative Reforms Fuel State-Level Debates
Public discourse in Tamil Nadu is currently dominated by intense state-level debates surrounding...
By Lokeshwari Panthadi 2026-06-27 10:51:23 0 81
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా...
By Pagadala Venkateswar 2026-04-27 05:45:01 0 96
SURAKSHA
Dr. Chandra Bhushan Kumar: Leading Island Governance
A visionary 1995-batch IAS officer of the AGMUT Cadre, Dr. Chandra Bhushan Kumar is steering the...
By Lokeshwari Panthadi 2026-07-18 06:49:24 0 64
SURAKSHA
Upendra Kumar Jain: Championing Justice Against Economic Crime
A distinguished IPS officer of the Madhya Pradesh cadre, Shri Upendra Kumar Jain serves as the...
By Lokeshwari Panthadi 2026-07-23 05:53:58 0 33
Telangana
సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన...
By Avunoori Mahesh 2026-05-15 02:30:58 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com